Unicef: ఆఫ్ఘనిస్థాన్‌లో కేవలం వారానికి సరిపడా వైద్య సరఫరాలు మాత్రమే వున్నాయి!: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Only enough medical products for a week in Afghanistan

  • వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • కాబూల్ ఎయిర్‌పోర్టులో తగ్గని టెన్షన్
  • వాణిజ్య విమానాల ల్యాండింగ్ కష్టం
  • ప్రజలను తరలించేందుకు వచ్చే ఖాళీ విమానాలు కూడా సాయం చేయలేని స్థితి

తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘనిస్థాన్‌లో అవసరమైన వైద్య సరఫరాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్నవి కేవలం ఒక వారం రోజులకు మాత్రమే సరిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో మధ్యప్రాచ్య ప్రాంత అధినేత అహ్మద్ అల్-మంధారి వెల్లడించారు.

‘‘ఉన్నవాటిలో 70 శాతం వైద్య సామగ్రిని ఆరోగ్య కేంద్రాలకు విడుదల చేశాం’’ అని ఆయన చెప్పారు. దుబాయిలో 500 మెట్రిక్ టన్నుల ఔషధాలు, తదితర వైద్య ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని చెప్పిన ఆయన.. కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటిని ఆఫ్ఘన్‌కు తీసుకురావడం కష్టమని అన్నారు. ఆఫ్ఘన్లను తరలించడానికి ఖాళీగా వస్తున్న విదేశీ విమానాలు కూడా సాయం చేయలేని స్థితి ఉందని ఆయన వివరించారు.

ఇలాంటి మానవీయ అవసరాలున్న ఉత్పత్తులను ఆఫ్ఘన్‌కు తరలించేందుకు హ్యూమనిటేరియన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ కలిసి పిలుపునిచ్చాయి. కాగా, అమెరికా దళాలు కాబూల్ నుంచి ఆఫ్ఘన్లను తరలించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఇటీవలే అమెరికాకు తాలిబన్లు హెచ్చరికలు చేశారు. ఒప్పుకున్న ఆగస్టు 31 డెడ్‌లైన్ తర్వాత అమెరికా దళాలు తమ దేశంలో ఉండకూడదని తేల్చిచెప్పారు.

Unicef
WHO
Afghanistan
  • Loading...

More Telugu News