TIDCO Houses: ఏపీలో రేపటి నుంచి టిడ్కో ఇళ్ల పంపిణీ

  • ఏపీలో గృహనిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
  • హాజరైన పురపాలక శాఖ మంత్రి బొత్స
  • రేపటి నుంచి 2.60 లక్షల ఇళ్ల పంపిణీ
  • ఆర్నెల్లలో 80 వేల ఇళ్ల పంపిణీ
TIDCO Houses distribution in AP commences from tomorrow

ఏపీలో టిడ్కో ఇళ్ల కేటాయింపులు, జగనన్న కాలనీల నిర్మాణం అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వివరాలు తెలిపారు. పనులు వేగంగా చేయాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. రాష్ట్రంలో 2.60 లక్షల టిడ్కో ఇళ్లను రేపటి నుంచి  లబ్దిదారులకు అందిస్తామని బొత్స తెలిపారు. వచ్చే ఆర్నెల్లలో 80 వేలు, మరో ఆర్నెల్లలో 80 వేల ఇళ్ల చొప్పున అందిస్తామని వివరించారు. మిగిలిన ఇళ్లను ఆఖరు వాయిదాలో ఇస్తామని తెలిపారు.

More Telugu News