Kollywood: నయనతార నిశ్చితార్థం అయిపోయింది.. రింగ్​ చూపించిన హీరోయిన్​

Nayan Gets Engaged She Shows Her Engagement Ring

  • ‘నెత్రికన్’ ప్రమోషన్ లో వెల్లడించిన హీరోయిన్
  • విఘ్నేశ్ చాలా మంచివాడని కామెంట్
  • ఎప్పుడూ ఆనందమేనన్న నయన్

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార నిశ్చితార్థం అయిపోయింది. ఎంతో కాలంగా తను ప్రేమిస్తున్న తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా నయన్ ప్రకటించింది. సినిమా ప్రమోషన్లకు ఎప్పుడూ దూరంగా ఉండే నయన్.. ఇప్పుడు తన తాజా చిత్రం ‘నెత్రికన్’ కోసం ప్రమోషన్ల బాట పట్టింది.

అందులో భాగంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి, నిశ్చితార్థం గురించి స్పష్టతనిచ్చింది. నిశ్చితార్థమైపోయిందని చెప్పిన నయన్.. తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించింది. విఘ్నేశ్ చాలా మంచివాడని చెప్పింది. అతడు తనతో ఉంటే ఎప్పుడూ ఆనందమేనంది.

‘నెత్రికన్’లో నయన్ అంధురాలిగా నటించింది. మిలింద్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజ్మల్ విలన్ గా నటించాడు. ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమాను విడుదల చేయనున్నారు. ఆగస్టు 13న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Kollywood
Tollywood
Nayanthara
Vighnesh Shivan
Engagement
Netrikan
  • Loading...

More Telugu News