COVID19: మా టీకాకు అనుమతివ్వండి.. కేంద్ర ప్రభుత్వానికి జాన్సన్​ అండ్​ జాన్సన్​ దరఖాస్తు

Johnson And Johnson Applies For its Single Dose Vaccine Emergency Use
  • ఆగస్టు 5నే దరఖాస్తు చేశామన్న సంస్థ
  • ఈరోజు వెల్లడించిన సంస్థ భారత ప్రతినిధి
  • టీకాను తీసుకొచ్చేందుకు ఏప్రిల్ నుంచే కసరత్తులు
భారత్ కు త్వరలోనే మరో విదేశీ టీకా రాబోతోంది. తన ఏకైక డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని సంస్థ ఈరోజు వెల్లడించింది. ఆగస్టు 5న వ్యాక్సిన్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ భారత ప్రతినిధి వెల్లడించారు.

కాగా, భారత్ లో తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని గత సోమవారం సంస్థ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు నడుస్తున్నాయని పేర్కొంది. ఏప్రిల్ లోనే టీకా ట్రయల్స్ కు సంబంధించీ అనుమతులు కోరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వ్యాక్సిన్ వినియోగంపై దరఖాస్తు చేసింది.
COVID19
Johnson and Johnson
Vaccine

More Telugu News