raj kundra: అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై మ‌రో న‌టి ఫిర్యాదు

one more complaint against raj kundra
  • స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న ముంబై పోలీసులు
  • ప్రైవేటు భాగాలు చూపించొద్ద‌ని కుంద్రాకు చెప్పిన న‌టి
  • అయితే, మార్పులు చేయ‌కుండా వీడియోను విడుద‌ల చేసిన కుంద్రా

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు చేసిన పోలీసులు విచార‌ణ కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ్‌కుంద్రాపై ప‌లువురు ఫిర్యాదులు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా, మరో నటి రాజ్‌కుంద్రాపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. త‌న‌ అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలను హాట్‌షాట్స్‌ యాప్‌లో రాజ్‌కుంద్రా విడుదల చేశారని ఆమె తెలిపింది.

ఆమె స్టేట్‌మెంట్‌ను ముంబై పోలీసులు రికార్డ్‌ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె మల్వాణీ పోలీస్‌స్టేషన్‌లో కుంద్రాపై ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్నారు. రాజ్‌కుంద్రా త‌న‌ను మోసం చేశాడ‌ని ఆమె తెలిపింది.

రాజ్‌కుంద్రాతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం త‌న‌ ప్రైవేట్‌ పార్ట్స్‌ని వీడియోలో చూపించకూడదనే షరతుతో ఓ అశ్లీల చిత్రంలో తాను న‌టించాన‌ని, అయితే రాజ్‌కుంద్రా మాత్రం మార్పులు చేయకుండా పూర్తి వీడియోని హాట్‌షాట్స్‌లో విడుదల చేశారని ఆమె ఆరోపించింది. ఈ విష‌యం త‌న‌కు త‌న‌ స్నేహితుడి ద్వారా తెలిసిందని తెలిపింది.

  • Loading...

More Telugu News