Shekhar C Mande: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఖాయం... అయితే ఎప్పుడన్నది చెప్పలేం: సీఎస్ఐఆర్ చీఫ్

CSIR DG warns about corona third wave in country

  • భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • వ్యాక్సిన్లు, మాస్కులు తప్పనిసరి అన్న శేఖర్ సి మండే
  • యూరప్, అమెరికాల్లో కరోనా ప్రబలుతోందని వెల్లడి
  • భారత్ జాగ్రత్తపడాలని సూచన

భారత్ లో కరోనా వ్యాప్తి మరోసారి పెరుగుతోన్న నేపథ్యంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ కచ్చితంగా సంభవిస్తుందని అన్నారు. అయితే, అది ఎప్పుడు, ఎలా ప్రారంభమవుతుందన్నది చెప్పలేమని తెలిపారు. థర్డ్ వేవ్ నుంచి రక్షణ పొందడంలో వ్యాక్సినేషన్, మాస్కులు ధరించడం కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. కేరళలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి సేకరించిన డేటాను విశ్లేషిస్తున్నామని తెలిపారు.

ఇక, డెల్టా ప్లస్ వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సినదేమీ లేదని డాక్టర్ శేఖర్ సి మండే స్పష్టం చేశారు. డెల్టా వేరియంట్ మాత్రం ప్రమాదకరమైనదని, డెల్టా ప్లస్ వేరియంట్ తో ముప్పు తక్కువేనని ఆయన వివరించారు. ప్రస్తుతం యూకే, తదితర యూరప్ దేశాలు, అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తోందని, భారత్ కూడా రక్షణాత్మక వైఖరి అవలంబించాల్సి ఉంటుందని సూచించారు. భారత్ లో కరోనా థర్డ్ వేవ్ వస్తే అది కొత్త వేరియంట్ కారణంగానే వ్యాపిస్తుందని వెల్లడించారు.

Shekhar C Mande
CSIR DG
Corona Third Wave
India
  • Loading...

More Telugu News