TDP: చుట్టూ మంటలు... మధ్యలో టీడీపీ కార్యకర్తల నిరసన... వీడియో ఇదిగో!

Nellore TDP workers protests with a risky way
  • దేశవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలు
  • రాష్ట్రంలోనూ మండుతున్న పెట్రోల్, డీజిల్ ధర
  • నెల్లూరు టీడీపీ కార్యకర్తల సాహసోపేత నిరసన
  • అందరి దృష్టిని ఆకర్షించిన వైనం
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు వినూత్న రీతిలో, కాస్తంత సాహసోపేతమైన పద్ధతిలో నిరసన చేపట్టారు. నెల్లూరు పట్టణంలో రద్దీగా ఉండే ఓ కూడలిలో రోడ్డుపై వలయాకారంలో మంటలు వేశారు.

చుట్టూ మంటలు... ఆ మధ్యలో టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసనలు నిర్వహించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఎంతో ప్రమాదకరమైన విధానం అయినప్పటికీ, టీడీపీ శ్రేణులు ఎక్కడా వెనుకంజ వేయకుండా తమ ఆందోళన కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.
TDP
Fire
Nellore
Protests
Fuel Price

More Telugu News