Varla Ramaiah: రూ. 41 వేల కోట్ల గురించి ఆర్థికమంత్రి సరిగా స్పందించలేదేమి?: వర్ల రామయ్య

  • ఏ ప్రభుత్వమైనా జవాబుదారీ తనంతో వ్యవహరించాలి
  • వైసీపీ ప్రభుత్వం మాత్రం అనుమానాస్పదంగా నడుస్తోంది
  • నాలుగు రోజుల తర్వాత కూడా మీ ఆర్థిక మంత్రి సరిగా స్పందించలేదు
Varla Ramaiah comments on Rs 41000 cr

ఏపీ ప్రభుత్వం సరైన లెక్కలు లేకుండానే రూ. 41 వేల కోట్లను ఖర్చు చేసిందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. 'ముఖ్యమంత్రి గారూ ఏ ప్రభుత్వమైనా జవాబుదారీ తనంతో వ్యవహరించాలి... కానీ మీ ప్రభుత్వం మాత్రం ఆది నుంచి అనుమానాస్పదంగానే నడుస్తోంది' అని అన్నారు. రూ. 41 వేల కోట్ల డబ్బుకు ప్రభుత్వం లెక్కలు చూపించడం లేదని రాష్ట్ర గవర్నర్ కు సాక్షాత్తు పీఏసీ ఛైర్మన్ ఫిర్యాదు చేస్తే... నాలుగు రోజుల తర్వాత కూడా ఆర్థిక మంత్రి సరిగా స్పందించలేదేమని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News