Anil Kumar Yadav: చంద్రబాబే ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో లేఖ రాయించారు: ఏపీ మంత్రి అనిల్

Minister Anil Kumar fires in Chandrababu and TDP

  • రాయలసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
  • స్పందించిన మంత్రి అనిల్
  • 'తెలంగాణ దేశం పార్టీ' అంటూ ఎద్దేవా 
  • ఓటుకు నోటు కేసు ప్రస్తావన
  • చంద్రబాబు భయపడుతున్నాడని వ్యాఖ్యలు

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజా పరిణామాలపై స్పందించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు లేఖ రాయడం వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడుతున్నారని, అందుకే తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తడంలేదని విమర్శించారు. తాజా పరిణామాలు పరిశీలిస్తే టీడీపీ 'తెలంగాణ దేశం పార్టీ'గా మారిపోయిన విషయం అర్థమవుతుందని అన్నారు.

చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నది టీడీపీయేనని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టును ఆపేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం ఆ కోవలోకే వస్తుందని తెలిపారు.

Anil Kumar Yadav
Chandrababu
Letter
TDP MLAs
Jagan
Rayalaseema Project
  • Loading...

More Telugu News