Anaya Soni: సాయం కోసం వేడుకుంటున్న టీవీ నటి

TV Actress Anaya Soni seeks financial help due to worse health reasons

  • హిందీ సీరియళ్లతో గుర్తింపు పొందిన అనయా సోనీ
  • తెలుగులోనూ నటించిన వైనం
  • ఆరేళ్ల కిందట కిడ్నీ ఫెయిల్
  • తండ్రి కిడ్నీ దానం చేసినా అదే పరిస్థితి
  • కిడ్నీ దాత కోసం ఎదురుచూపులు

అనయా సోనీ అనే బుల్లితెర నటి ఆరోగ్యం క్షీణించడంతో ఆర్థికసాయం కోసం దీనంగా వేడుకుంటోంది. అనయా హిందీలో అదాలత్, క్రైమ్ పెట్రోల్, ఇష్క్ మే మర్ జావా అనే సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగులో రుద్రమదేవి సీరియల్ లోనూ నటించింది. అనయా ఆరేళ్ల కిందట కిడ్నీ వ్యాధికి గురైంది. ఓ కిడ్నీ చెడిపోవడంతో తండ్రి ఓ కిడ్నీ దానం చేశాడు. అయితే, ఇప్పుడా కిడ్నీ వైఫల్యం చెందడంతో అనయా ఆరోగ్యం బాగా క్షీణించింది.

పైగా, వారి కుటుంబ వ్యాపారం కూడా ఓ అగ్నిప్రమాదం కారణంగా దెబ్బతింది. అనయా తల్లికి వస్త్రవ్యాపారం ఉండగా, అగ్నిప్రమాదంలో బట్టలు, కుట్టు యంత్రాలు కాలిపోయాయి. దాంతో వారి కుటుంబం దాదాపుగా రోడ్డున పడ్డట్టయింది. ఓ వీడియోలో అనయా మాట్లాడుతూ, ప్రస్తుతం తమ కుటుంబం తిండి కూడా లేని పరిస్థితుల్లో చిక్కుకుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎవరైనా కిడ్నీ దానం చేస్తే తాను కోలుకుంటానని చెబుతోంది.

ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామని తాను ఊహించలేదని, కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించింది. తమ పరిస్థితి పట్ల ఉదారంగా స్పందించి సాయం చేయాలని అర్థిస్తోంది. ఈ క్రమంలో అనయా తన బ్యాంకు ఖాతా నెంబరు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.

Anaya Soni
Health
Kidney
Financial Help
Mumbai
  • Loading...

More Telugu News