YS Sharmila: షర్మిలను తెలంగాణ ప్రజలు ఏమేరకు ఆదరిస్తారు?: 72 నియోజకవర్గాల్లో చెన్నై సంస్థ సర్వే

Sharmila conducted a secret survey in Telangana

  • రహస్యంగా సర్వే చేయించిన షర్మిల
  • నివేదిక అందించిన సర్వే సంస్థ
  • ఎల్లుండి పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలను ప్రజలు ఆదరిస్తారా? నిజంగా ఆమెకు ప్రజల్లో అంత ఆదరణ ఉందా? ముఖ్యమంత్రి కావాలంటే షర్మిల ఏం చేయాలి? వైఎస్సార్‌పై తెలంగాణ ప్రజల్లో ఇంకా అభిమానం ఉందా? వంటి ప్రశ్నలతో చెన్నైకి చెందిన ఓ సంస్థ తెలంగాణలోని 72 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. షర్మిలే రహస్యంగా ఈ సర్వే చేయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు నెలలపాటు నిర్వహించిన ఈ సర్వేకు సంబంధించిన నివేదికను ఆ సంస్థ షర్మిలకు అందించినట్టు సమాచారం. ఎల్లుండి (8న) పార్టీని ప్రకటించనున్న షర్మిల అంతకుముందే ప్రజల్లో తమకున్న బలం, జిల్లాల్లో తనకు ఉన్న ఆదరణ గురించి తెలుసుకునేందుకు ఈ సర్వే చేయించినట్టు సమాచారం.

YS Sharmila
Telangana
YSR Telangana Party
Survey
  • Loading...

More Telugu News