NHRC: రఘురామ వ్యవహారంలో ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు ఎన్ హెచ్చార్సీ సమన్లు

NHRC issues summons to AP Home Secretary and DGP
  • సీఐడీ అరెస్ట్ పై ఎన్ హెచ్చార్సీకి రఘురామ ఫిర్యాదు
  • థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వెల్లడి
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ హెచ్చార్సీ నోటీసులు
  • నివేదిక పంపకపోవడంతో తాజాగా ఆగ్రహం
తనను ఏపీ సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, విచారణ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎంపీ రఘురామకృష్ణరాజు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్ హెచ్చార్సీ అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. రఘురామ అరెస్ట్ పై నివేదిక పంపాలని ఆదేశించింది. అయితే, ఆ నోటీసులకు ఏపీ ప్రభుత్వం స్పందించలేదంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు తాజాగా కండిషనల్ సమన్లు జారీ చేసింది. నివేదిక పంపడంలో ఎందుకు జాప్యం ఏర్పడిందంటూ ఎన్ హెచ్చార్సీ అసహనం వ్యక్తం చేసింది. ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. గడువులోగా నివేదిక అందించకపోతే, ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు స్పష్టం చేసింది.
NHRC
Summons
AP Home Secretary
DGP
Raghu Rama Krishna Raju
AP CID

More Telugu News