Delhi High Court: పబ్లిసిటీ కోసం పిటిషన్లు వేస్తారా.. రూ.20 లక్షలు జరిమానా కట్టండి: జుహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

The petition was just for publicity delhi high court fires on Actress Juhi Chawla

  • 5జీ అమలును వ్యతిరేకిస్తూ నటి జుహీ చావ్లా వ్యాజ్యం
  • కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
  • ప్రచారం కోసమే పిటిషన్‌ వేశారని వ్యాఖ్య
  • విచారణకు అడ్డుతగిలిన జుహీ అభిమానులు
  • వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

దేశంలో 5జీ అమలును సవాల్‌ చేస్తూ ప్రముఖ బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేవలం ప్రచారం కోసం మాత్రమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని అభిప్రాయపడుతూ, కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా జుహీతో పాటు ఈ పిటిషన్‌ దాఖలు చేసిన వారందరూ కలిసి కోర్టు ఫీజు కింద రూ.20 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

అలాగే జుహీ చావ్లా ఇచ్చిన లింక్‌ ద్వారా ఆమె పిలుపు మేరకు కొంత మంది కోర్టు వర్చువల్‌ విచారణలో పాల్గొని రాద్ధాంతం చేశారు. ఆమె నటించిన చిత్రాల్లోని పాటలు పాడుతూ విచారణకు అడ్డు తగిలారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని కోర్టు ఆదేశించింది.

Delhi High Court
Juhi Chawla
5G
Bollywood
  • Loading...

More Telugu News