Lunar Eclipse: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. 'సూపర్ బ్లడ్ మూన్‌'గా కనువిందు!

Lunar Eclipse on May 26
  • భారత్‌లో పాక్షికంగా కనిపించనున్న గ్రహణం
  • అమెరికా, కెనడా, మెక్సికో, సెంట్రల్ అమెరికాలో పూర్తి గ్రహణం 
  • మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభమై 6.23 గంటలకు ముగింపు

భారత్‌లో నేడు సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. భారత్‌లో పాక్షికంగానే కనిపించే ఈ గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. చంద్రుడు నేడు ‘సూపర్ బ్లడ్‌మూన్’గా దర్శనమివ్వనున్నాడు. అంటే చందమామ నేడు రక్తపు ముద్దలా దర్శనమిస్తుందన్నమాట. అయితే, భారత‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు దీనిని వీక్షించే అవకాశం లేదు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలు, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ గ్రహణం దర్శనిమిస్తుంది.

ఇక గ్రహణం మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్‌లో మొదలై సాయంత్రం 6.23 గంటలకు ముగుస్తుంది. నాసా ప్రకారం.. పూర్తి గ్రహణం.. అమెరికా, కెనడా, మెక్సికో, సెంట్రల్ అమెరికాలోని చాలా ప్రాంతాలు, ఈక్వెడార్, పశ్చిమ పెరు, దక్షిణ చిలీ, అర్జెంటినా దేశాల్లో కనిపిస్తుంది.

మన దేశంలోని అగర్తల, ఐజ్వాల్, కోల్‌కతా, చిరపుంజి, కూచ్ బెహర్, డైమండ్ హార్బర్, దిఘా, గువాహటి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, లుమ్డింగ్, మాల్దా, నార్త్ లఖిమ్‌పూర్, పారాదీప్, పాశీఘాట్, పోర్ట్ బ్లెయిర్, పూరి, షిల్లాంగ్ తదితర ప్రాంతాలతోపాటు నేపాల్, పశ్చిమ చైనా, మంగోలియా, తూర్పు రష్యాలలో గ్రహణం పాక్షికంగా కనిపించనుంది.

  • Loading...

More Telugu News