Paytm: పేటీఎం యూజర్లకు శుభవార్త.. యాప్ లో కొవిడ్ వ్యాక్సిన్ లభ్యత సమాచారం!

Paytm launches feature to track Covid vaccine slot availability
  • మొత్తం 780 జిల్లాలకు సంబంధించిన సమాచారం
  • టైమ్ స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడు అలెర్ట్
  • అందుబాటులోకి ‘పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్’
డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం పేటీఎం తమ యూజర్లకు శుభవార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుందన్న సమాచారంతోపాటు టైమ్‌స్లాట్ తదితర వివరాలను యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం ‘పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు, ఆయా స్లాట్లు అందుబాటులోకి వచ్చినప్పుడు ఖాతాదారులను అప్రమత్తం చేయనుంది. మొత్తం 780 జిల్లాల్లో వ్యాక్సిన్ లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని అందించనున్నట్టు తెలిపింది. ఏజ్ గ్రూప్, పిన్ కోడ్‌ల ద్వారా కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Paytm
corona vaccine
Corona Virus

More Telugu News