Andhra Pradesh: ఉగ్రరూపం దాల్చిన కరోనా... మరికొన్ని ఆంక్షలు విధించిన ఏపీ సర్కారు

AP Govt imposes some more restrictions
  • ఏ వేడుక అయినా 50 మందికే అనుమతి
  • జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత
  • అదే బాటలో స్పోర్ట్స్ కాంప్లెక్సులు
  • 50 శాతం సామర్థ్యంతో ప్రజారవాణా, సినిమా హాళ్లు
సెకండ్ వేవ్ లో కరోనా రక్కసి ఎంతో వేగంగా పాకిపోతోంది. దేశంలో కొన్నిరోజుల వ్యవధిలోనే రోజువారీ కేసుల సంఖ్య వేల నుంచి లక్షలకు పెరిగింది. ఏపీలోనూ కొవిడ్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. దాంతో ప్రభుత్వం మరికొన్ని ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో ఇకపై ఏ వేడుక అయినా 50 మందికి మించరాదని స్పష్టం చేసింది.

జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు మూసివేయాలని ఆదేశించింది. ప్రజారవాణా, సినిమా హాళ్లు 50 శాతం సామర్థ్యంతోనే నిర్వహించాలని పేర్కొంది. పని ప్రదేశాల్లో ఒక్కో ఉద్యోగికి మధ్య 50 గజాల దూరం పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్లు విధిగా ఉపయోగించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 వేల రెమ్ డెసివిర్ ఇంజక్షన్ వయల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి 341 టన్నుల ఆక్సిజన్ వస్తున్నా సరిపోవడంలేదని వెల్లడించారు. అయితే, చాలా చోట్ల ఆక్సిజన్ వృథా అవుతోందని సింఘాల్ విచారం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Restrictions
Corona Virus
Measures

More Telugu News