ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లు ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే మాకు అభ్యంతరం లేదు: బీసీసీఐ
- కరోనా నేపథ్యంలో ఒత్తిడికి గురవుతున్న ఆటగాళ్లు
- కుటుంబీకులకు కరోనా సోకడంతో అర్ధాంతరంగా వైదొలగిన అశ్విన్
- ఆటగాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తామన్న బీసీసీఐ
ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ టోర్నీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల అభిప్రాయాలకు గౌరవమిస్తామని తెలిపింది.
ఇప్పటి వరకు ఈ సీజన్ ఐపీఎల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిందని బీసీసీఐ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు. ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే... అది వారు తీసుకున్న మంచి నిర్ణయంగానే భావిస్తామని చెప్పారు.