Johnson and Johnson: ‘సింగిల్ డోస్’ కరోనా టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు

J and J seeks permission to conduct phase 3 trials for single shot Covid vaccine in India

  • టీకా దిగుమతుల లైసెన్స్ కూ అనుమతి కోరిన సంస్థ
  • త్వరగా నిర్ణయం తీసుకోవాలని నిపుణుల కమిటీకి విజ్ఞప్తి
  • ఈ నెల 12వ తేదీనే తొలుత దరఖాస్తు పెట్టుకున్న సంస్థ
  • సాంకేతిక కారణాలతో నిన్న పున:సమర్పణ

‘సింగిల్ డోస్’ కరోనా వ్యాక్సిన్ మన దేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని కోరుతూ అంతర్జాతీయ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసింది. దాంతో పాటు వ్యాక్సిన్ దిగుమతి లైసెన్స్ కూ అనుమతి కోరింది. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీని విజ్ఞప్తి చేసింది.

విదేశీ వ్యాక్సిన్లకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో.. జాన్సన్ అండ్ జాన్సన్ మూడో ఫేజ్ ట్రయల్స్ కు దరఖాస్తు చేసుకుంది. ఈ నెల 12వ తేదీనే సుగమ్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా గ్లోబల్ క్లినికల్ ట్రయల్ డివిజన్ కు జే అండ్ జే దరఖాస్తు చేసుకుందని, అయితే, అందులో చాలా సాంకేతిక అంశాలు ఉన్నందున దరఖాస్తును సవరించి సోమవారం మళ్లీ దరఖాస్తును పున:సమర్పించిందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కొంచెం భిన్నం. మిగతా వ్యాక్సిన్లను రెండు డోసుల చొప్పున ఇవ్వాల్సి ఉంటే.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ను ఒక్క డోసు ఇస్తే సరిపోతుంది. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మూడు నెలల పాటు నిల్వ ఉంచొచ్చని సంస్థ చెబుతోంది.

Johnson and Johnson
Single Dose Vaccine
COVID19
Janssen
  • Loading...

More Telugu News