BCCI: టీమిండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించిన బీసీసీఐ

BCCI announces annual players contracts

  • 2020 అక్టోబరు-2021 సెప్టెంబరు వరకు కాంట్రాక్టులు
  • ఏ ప్లస్ గ్రేడులో కోహ్లీ, రోహిత్, బుమ్రా
  • ఏడాదికి రూ.7 కోట్లు
  • ఏ గ్రేడులో అశ్విన్, జడేజా, పుజారా, ధావన్ తదితరులు
  •  ఏడాదికి రూ.5 కోట్లు

గత కొంతకాలంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా ఆటగాళ్లకు కాంట్రాక్టు విధానం అమలు చేస్తోంది. ఆటగాళ్ల స్థాయిని బట్టి వారికి పారితోషికం అందిస్తోంది. అందుకోసం ఆటగాళ్లకు గ్రేడ్లు ఇస్తోంది. ఈ క్రమంలో 2020 అక్టోబరు-2021 సెప్టెంబరు కాలానికి వర్తించేలా వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది.

'ఏ ప్లస్' గ్రేడులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్ల చొప్పున చెల్లిస్తారు.

ఇక 'ఏ' గ్రేడులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వీరికి సంవత్సరానికి రూ.5 కోట్లు చెల్లిస్తారు.

'బి' గ్రేడులో వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి రూ.3 కోట్ల మేర వార్షిక పారితోషికం ఉంటుంది.

చివరగా 'సి' గ్రేడులో కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, శుభ్ మాన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరు ఏడాదికి రూ.1 కోటి చొప్పున అందుకుంటారు.

BCCI
Annual Contracts
Players
Team India
  • Loading...

More Telugu News