Corona Virus: కదలకుండా కూర్చుని పనిచేసేవారికి కరోనా ముప్పు అధికం: తాజా అధ్యయనంలో వెల్లడి

corona threat is higher for those who sit and work without moving
  • ఏదో ఒక రకంగా శారీరక శ్రమ చేసే వారికి ముప్పు తక్కువ
  • ధూమపానం, ఊబకాయం, మధుమేహం తదితర జబ్బులున్న వారికీ ముప్పే
  • శారీరక శ్రమ చేయని వారే ఆసుపత్రుల పాలవుతున్నారు
కదలకుండా కూర్చుని పనిచేసే వారికి కరోనా మహమ్మారి ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. గత రెండేళ్లుగా ఎలాంటి శారీరక శ్రమ చేయని వారే కొవిడ్ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు  అమెరికాలోని కాలిఫోర్నియో శాన్‌డీగో యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఐసీయూలో చేరి ప్రాణాలు కోల్పోయిన వారిలోనూ వీరి సంఖ్యే ఎక్కువని తేలింది. ఏదో ఒక రూపంలో శారీరక శ్రమ చేసే వారిలో కరోనా ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు.

అలాగే, ధూమపానం, ఊబకాయం, మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, కేన్సర్ తదితర జబ్బులతో బాధపడుతున్న వారికి కూడా కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో శారీరక శ్రమ చేయని వారికి కరోనా ముప్పు మరింత ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమైందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, కొవిడ్ మార్గదర్శకాలను పాటించడంతోపాటు శారీరక శ్రమ కూడా చేస్తే కరోనా ముప్పు నుంచి బయటపడవచ్చని అధ్యయనకారులు పేర్కొన్నారు.
Corona Virus
America Scientists
Exercise
Diabetes

More Telugu News