Dubai: మేడపై ఉక్రెయిన్ మహిళల నగ్న ఫొటో షూట్.. అందర్నీ వెనక్కి పంపించేస్తామన్న దుబాయ్

Ukraine women nude photo shoot in Dubai
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు
  • 11 మంది మహిళలు, ఫొటోగ్రాఫర్ అరెస్ట్
  • ధ్రువీకరించిన ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ

దుబాయ్‌లోని ఓ ఎత్తైన భవనంలోని ఓ అంతస్తు బాల్కనీలో నగ్నంగా ఫొటో షూట్ చేసిన 11 మంది మహిళలతోపాటు ఓ ఫొటోగ్రాఫర్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. మహిళలు ఉక్రెయిన్‌కు చెందిన వారు కాగా, ఫొటోగ్రాఫర్ రష్యాకు చెందిన వాడని దుబాయ్ పోలీసులు తెలిపారు. వారు అరెస్ట్ అయిన విషయాన్ని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ కూడా ధ్రువీకరించింది.

అయితే, అరెస్ట్ అయిన వారి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. అరెస్ట్ అయిన అందరినీ వెనక్కి పంపిస్తామని దుబాయ్ అటార్నీ జనరల్ ఇసామ్ ఇసా అల్ హందెయిన్ తెలిపారు. కాగా, మహిళల నగ్న ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన దుబాయ్ అధికారులు ఫొటోషూట్‌లో పాల్గొన్న మహిళలతోపాటు షూట్ చేసిన ఫొటోగ్రాఫర్‌ను నిన్న అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News