High Way: ఏపీకి రూ.810 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులకు ఆమోదం

Govt approves over Rs 6100 crore worth highway projects

  • దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు
  • రూ.6,176 కోట్ల నిధులతో చేపట్టనున్న కేంద్రం
  • అసోం, లడఖ్ లకూ ప్రాజెక్టుల ఆమోదం

దేశంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ.6,176 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. ఏపీ సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం రూ.6,176 కోట్ల ప్రాజెక్టులకు ఓకే చెప్పింది.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రూ.810 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. మహారాష్ట్రలో రూ.2,801 ప్రాజెక్టులు, అసోంలో రూ.1,259 కోట్లు, లడఖ్ లో రూ.779 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించి కేంద్ర రవాణ శాఖ ప్రకటన విడుదల చేసింది. హైవేల అభివృద్ధి, పునరావాసం, పునర్నిర్మాణం వంటి వాటి కోసం ప్రాజెక్టులను ఆమోదించినట్టు వెల్లడించింది.

High Way
Andhra Pradesh
Union Government
Maharashtra
Assom
Ladakh
  • Loading...

More Telugu News