Vizag Steel Plant: నాటి స్ఫూర్తితో విశాఖ ఉక్కు కోసం పోరాడదాం: ఆర్.నారాయణమూర్తి

Senior Actor RNarayanamurthy About Vizag Steel Plant

  • విజయవాడలో విశాఖ ఉక్కుపై కార్టూన్, చిత్రలేఖన ప్రదర్శన
  • నాటి పోరాట ఘట్టాలను వివరించిన నటుడు
  • ప్రాణత్యాగం చేసిన వారిని మననం చేసుకున్న నారాయణమూర్తి

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాట స్ఫూర్తితో నేడు దానిని రక్షించుకోవడానికి పోరాడాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఉద్యమంపై నిన్న విజయవాడలో కళాకారులు ఏర్పాటు చేసిన కార్టూన్, చిత్రలేఖన ప్రదర్శనకు  నారాయణమూర్తి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాటాన్ని వివరించారు. కర్మాగారాన్ని ఎలా సాధించుకున్నదీ చెబుతూ, నాటి పోరాట ఘట్టాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఈ సందర్భంగా నాటి పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకున్నారు. నేడు అదే స్ఫూర్తితో కంపెనీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నారాయణమూర్తి అన్నారు.

Vizag Steel Plant
R.Narayanamurthy
Vijayawada
  • Loading...

More Telugu News