Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ప్రైవేటు కంపెనీకి ఇసుక తవ్వకాలు

AP Govt handed over sand mining to a private firm

  • రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు బిడ్డింగ్
  • ఇసుక రీచ్ లు మూడు ప్యాకేజీలుగా విభజన
  • మూడు ప్యాకేజీలను దక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్
  • ఏడాదికి రూ.765 కోట్ల ఆదాయం వస్తుందన్న ఏపీ సర్కారు

ఇసుక మైనింగ్ అంశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇసుక రీచ్ ల్లో తవ్వకాల బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఇసుక తవ్వకాల బాధ్యతలు చేజిక్కించుకుంది. ఇసుక అమ్మకాల బాధ్యతను కూడా ఈ సంస్థే దక్కించుకుంది.

 రాష్ట్రవ్యాప్తంగా వున్న ఇసుక రీచ్ లను మూడు ప్యాకేజీలుగా విభజించిన ఎంఎస్ టీసీ ఆ మేరకు వేలం నిర్వహించింది. రెండేళ్ల కాలవ్యవధి వర్తించేలా ఇసుక తవ్వకాలకు బిడ్డింగ్ చేపట్టారు. వేలంలో మూడు ప్యాకేజీలను జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ కైవసం చేసుకుంది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఏడాదికి రూ.765 కోట్ల ఆదాయం రానుందని వెల్లడించింది.

Andhra Pradesh
Sand Mining
Jayaprakash Power Ventures
Bidding
Auction
  • Loading...

More Telugu News