Acharya: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... మహాశివరాత్రి సందర్భంగా 'ఆచార్య' నుంచి తొలి సాంగ్!

Acharya First Song on 11th
  • 11న తొలి సాంగ్ విడుదల
  • మణిశర్మ సంగీత దర్శకత్వం
  • మే 13న విడుదల కానున్న చిత్రం
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న క్రేజీ మూవీ   'ఆచార్య'కు సంబంధించిన మరో లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 11న సినిమాలో తొలిసాంగ్ ను విడుదల చేయనున్నారన్నదే ఈ అప్ డేట్.

ఈ న్యూస్ బయటకు రాగానే, మెలోడీ బ్రహ్మ మణిశర్మ తమ హీరోకు గతంలో అందించిన హిట్ సాంగ్స్ ను వైరల్ చేస్తూ, వాటికి మించినట్టుగా ఇది ఉంటుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చాలా రోజుల తరువాత చిరంజీవి చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాతో పాటు, యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది.

ఇక మే 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో చెర్రీకి జోడీగా పూజా హెగ్డే తళుక్కున మెరవనుంది. సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, అనుకున్న సమయానికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Acharya
First Song
Mani Sharma

More Telugu News