Chiranjeevi: ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... 'ఆచార్య' సెట్స్ నుంచి ఆసక్తికరమైన ఫొటో

Chiranjeevi and Ram Charan in army dress on Acharya sets

  • సింగరేణి గనుల్లో 'ఆచార్య' షూటింగ్
  • షూటింగ్ కు హాజరైన చిరంజీవి, రామ్ చరణ్
  • ఇటీవలే మారేడుమిల్లిలో షెడ్యూల్ పూర్తి
  • ఇల్లెందులో కొత్త షెడ్యూల్ ప్రారంభం
  • 'ఆచార్య'లో కీలకపాత్ర పోషిస్తున్న రామ్ చరణ్

చిరంజీవి, కొరటాల శివ కలయికలో వస్తున్న 'ఆచార్య' చిత్రం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సింగరేణి బొగ్గు గనుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా 'ఆచార్య' సెట్స్ నుంచి ఓ ఆసక్తికరమైన ఫొటో బయటికి వచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ సైనిక దుస్తుల్లో ఉండగా, వారికి దర్శకుడు కొరటాల శివ సీన్ వివరిస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఆచార్య', కొత్త షెడ్యూల్ ఇల్లెందులో షురూ అయింది. ఇక్కడి బొగ్గు గనుల్లో ఫైటింగ్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారు. దర్శకుడు కొరటాల ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ లతో కలిసి ఈ ఉదయమే లొకేషన్ ను పరిశీలించారు.

కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ 'ఆచార్య' చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన కాసేపు తళుక్కుమనే పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది.

Chiranjeevi
Ramcharan
Army Dress
Acharya
Illendu
Coal Mines
  • Loading...

More Telugu News