ECI: పశ్చిమ బెంగాల్​, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలకు ఈ నెల 15 తర్వాత షెడ్యూల్​!

Dates for Bengal and Tamil Nadu and Kerala polls likely after February 15
  • 10 నుంచి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఈసీ బృందం పర్యటన
  • ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఒకే దశ ఎన్నికలకు చాన్స్
  • బెంగాల్ లో 6 నుంచి 8, అసోంలో 2 నుంచి 3 దశల్లో పోలింగ్
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధమవుతోంది. ఎన్నికల సన్నద్ధతను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించనుంది. ఈ నెల 15 నాటికి పర్యటనను పూర్తి చేస్తుంది.

ఆ పర్యటన పూర్తి కాగానే ఈ నెల 15 తర్వాత నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెప్పాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని వెల్లడించాయి.

పశ్చిమబెంగాల్ లో ఆరు నుంచి 8 దశలు, అసోంలో రెండు నుంచి మూడు దశల్లో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. అన్ని రాష్ట్రాల ఎన్పికల ఫలితాలనూ ఒకే రోజు వెల్లడిస్తారని తెలిపాయి. పది, ఇంటర్ పరీక్షలు మొదలయ్యే మే 1 లోపు అన్ని ఎన్నికలనూ పూర్తి చేయాలని ఈసీ టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పాయి.

కాగా, ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఎన్నికల సంసిద్ధతను తెలుసుకోనున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్, అసోంలో పరిస్థితులను వారు తెలుసుకున్నారు.
ECI
Suneel Aurora
CEC
West Bengal
Tamilnadu
Kerala
Puducheri
Assom

More Telugu News