Ganta Srinivasa Rao: విశాఖ ఉక్కు కోసం... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasarao resigns for Visakha Steel Plant
  • విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు గంటా వెల్లడి
  • రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు పంపిన వైనం
  • ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలన్న గంటా
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం నిర్ణయానికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు గంటా ప్రకటించారు.

ఈ మేరకు స్వదస్తూరీతో రాసిన లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపినట్టు వెల్లడించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని గంటా నిన్ననే పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తానే మొదట నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ప్లాంటు పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేస్తానని కూడా గంటా ప్రకటించారు.
Ganta Srinivasa Rao
Visakha Steel Plant
Resign
MLA
Andhra Pradesh

More Telugu News