Konidela Anjana Devi: అమ్మకు పుట్టినరోజు వేడుక జరిపిన మెగా బ్రదర్స్... ఫొటో ఇదిగో!

Mega Brothers celebrates their mother birthday

  • నేడు కొణిదెల అంజనాదేవి పుట్టినరోజు
  • ఒక్కచోట చేరిన మెగా తోబుట్టువులు
  • తల్లితో కేక్ కట్ చేయించిన వైనం
  • వేడుక ముగిసిన తర్వాత గన్నవరం చేరుకున్న పవన్

మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ఇవాళ తమ మాతృమూర్తి కొణిదెల అంజనాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు, తమ ఇద్దరు సోదరీమణులతో కలిసి తల్లికి జన్మదిన వేడుకలు జరిపారు. చిరంజీవి నివాసంలో అందరూ కలిసి అంజనాదేవితో కేట్ కట్ చేయించినట్టు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో చిరంజీవి అర్ధాంగి సురేఖ, నాగబాబు అర్ధాంగి పద్మజ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. తల్లి జన్మదిన వేడుక ముగిశాక పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు.

కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం అని తెలిసిందే. చిరంజీవి, నాగబాబు, విజయదుర్గ, మాధవి, పవన్ కల్యాణ్ లను ఒక్కచోట చూసుకుని అంజనాదేవి ఇవాళ మురిసిపోయారు.

Konidela Anjana Devi
Chiranjeevi
Pawan Kalyan
Nagababu
Birthday
  • Loading...

More Telugu News