West Bengal: బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయించిన బెంగాల్ ఐపీఎస్ అధికారి రాజీనామా

Bengal Officer Who Arrested BJP Workers resigns
  • జనవరి 21న ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • సువేందు అధికారి ర్యాలీలో నినాదాలు చేసిన కార్యకర్తలు
  • అదే రాత్రి వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
దేశద్రోహులను షూట్ చేయండి అంటూ నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ ఆదేశించిన బెంగాల్ పోలీసు ఉన్నతాధికారి హుమయూన్ కబీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

గత డిసెంబర్ లో హుమయూన్ ఐజీ క్యాడర్ కు ప్రమోట్ అయ్యారు. జనవరి 21న బీజేపీ నేత సువేందు అధికారి నిర్వహించిన ఓ ర్యాలీలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు దేశద్రోహులను కాల్చి చంపాలంటూ నినాదాలు చేశారు. అదే రాత్రి హుమయూన్ ఆదేశాలతో ఆ ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు.

టీఎంసీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి ఇటీవలే బీజేపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అరెస్టులపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా పోలీసులకు సంబంధించిన అంశమని, దీని వెనుక రాజకీయాలు లేవని చెప్పారు.
West Bengal
Humayun Kabir
IPS
Resign
BJP

More Telugu News