Nagababu: మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా నాగబాబు భావోద్వేగ స్పందన

Nagababu wishes his mother on her birthday

  • ఇవాళ కొణిదెల అంజనా దేవి జన్మదినం
  • తల్లి పుట్టినరోజుపై నాగబాబు ట్వీట్
  • జీవితాన్నిచ్చావంటూ తల్లికి కృతజ్ఞతలు
  • అమ్మే తన బలం అని వెల్లడి

మెగాబ్రదర్ నాగబాబు తన మాతృమూర్తి కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో భావోద్వేగభరితంగా స్పందించారు. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, సముద్రం లాంటి జీవితంలో తనను స్థిరంగా నిలిపినందుకు తల్లికి కృతజ్ఞతలు తెలిపారు. నా ప్రియాతిప్రియమైన అమ్మకు హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు.

"నా ప్రతి ప్రయత్నం వెనుక బలం అమ్మే. పాతాళానికి పడిపోయిన పరిస్థితుల్లో నా మార్గంలో వెలుగులు నింపిన కాంతి అమ్మ. నా బాధలన్నింటిని మటుమాయం చేసేలా నువ్వు వాత్సల్యంతో హత్తుకున్నందుకు కృతజ్ఞతలు చెబితే సరిపోదమ్మా! నీ ఓదార్పు మాటలు చిన్నవే కావొచ్చు కానీ, జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనేంత శక్తినిస్తాయి. నేనివాళ ఎంతో దృఢమైన వ్యక్తిలా నిలబడ్డానంటే అందుకు కారణం నీలాంటి శక్తిమంతమైన తల్లి పెంపకం వల్లే. ఈ జీవితాన్నిచ్చినందుకు కృతజ్ఞతలు అమ్మా" అంటూ పేర్కొన్నారు.

Nagababu
Anjana Devi
Birthday
Mother
Wishes
  • Loading...

More Telugu News