Johnson and Johnson: మరోవారంలో జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు

Johnson and Johnson COVID Vaccine Results Next Week

  • సింగిల్ డోస్ టీకాను అభివృద్ధి చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్
  • సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలో టీకాను భద్రపరిచే సౌలభ్యం
  • ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు

సింగిల్ డోస్ కరోనా టీకాను అభివృద్ది చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ వచ్చే వారం ప్రయోగ ఫలితాలను వెల్లడించనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను తప్పనిసరిగా రెండు డోసులు ఇవ్వాల్సి ఉండగా, తాము అభివృద్ది చేస్తున్న టీకాను సింగిల్ డోస్‌లో ఇస్తేనే సరిపోతుందని జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆ టీకా కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ప్రస్తుతం ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, కొవాగ్జిన్ వంటి కరోనా టీకాలతోపాటు రష్యా, చైనా దేశాల్లోనూ కొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇవన్నీ కొంత విరామంలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వైరస్‌కు అడ్డుకట్ట పడుతుంది. అలాగే, వీటిని మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీంతో వీటి నిల్వ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది.

జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేస్తున్న టీకా మాత్రం ఒక్క డోస్‌ వేస్తే సరిపోతుంది. అలాగే, రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత వద్దే దానిని నిల్వ చేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు ప్రపంచం ఈ టీకా కోసం ఎదురుచూస్తోంది. అంతేకాదు, ఈ టీకా కోసం యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్, కెనడా, వంటి దేశాలు ఇప్పటికే ఒప్పందాలు  కుదుర్చుకున్నాయి కూడా. కాగా, డబుల్ డోసులో తీసుకునే మరో టీకాను కూడా జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేస్తుండడం గమనార్హం.

Johnson and Johnson
COVID19
Corona vaccine
  • Loading...

More Telugu News