Lover: తలపై కత్తిదిగబడినట్టు ప్రియుడి నాటకం... చూసి హడలిపోయిన ప్రియురాలు.. వైరల్ అయిన ప్రాంక్ వీడియో ఇదిగో!

Lover Prank Video Goes Viral

  • గర్ల్ ఫ్రెండ్ ను భయపెట్టేందుకు వీడియో
  • ఆమె ప్రేమపై నెటిజన్ల ప్రశంసలు
  • గంటల వ్యవధిలో లక్షల వ్యూస్

ఇటీవలి కాలంలో యువతీ యువకులు చేసే ప్రాంక్ వీడియోల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అందులో కూడా వైవిధ్యంగా ఉండే వీడియోలకు ఎంతో అదరణ లభిస్తోంది. తాజాగా, ఓ యువకుడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన వీడియోకు కోట్ల వీడియోలు వచ్చాయి. తన స్నేహితురాలిని భయపెట్టేందుకు అతను ఈ వీడియో తీశాడు. అంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ దృశ్యాన్ని చూసిన అతని స్నేహితురాలు చూపిన భయాన్ని, ఆమె ఆందోళనను సహాయం కోసం చేసిన ప్రయత్నాలను చూసిన నెటిజన్లు ఆమె ప్రేమ, ఆప్యాయతలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఈ వీడియోను లాన్స్ స్టీవార్ట్ అనే వ్యక్తి షేర్ చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ ను భయపెట్టేందుకు రక్తం పూసున్న కత్తి తన మెదడులో కుడి వైపు నుంచి ఎడమ వైపునకు దిగినట్టు, దాంతో చావు బతుకుల మధ్య ఉన్నట్టు నాటకమాడాడు. చూసేందుకు అది నిజమైన కత్తిలా, మెదడులో దిగినట్టుగానే కెమెరాకు కనిపిస్తోంది. అతన్ని చూసిన స్నేహితురాలు జూలియా, పెద్దగా అరుస్తూ రోదించింది. పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించింది.

ఆమె ఆదుర్దా పరాకాష్ఠకు చేరడంతో స్టీవార్ట్ స్పందించి, అది ఓ ప్రాంక్ మాత్రమే నని చెప్పాడు. ఈ నెల 10న ఈ వీడియోను అతను షేర్ చేయగా, గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్, వేల కామెంట్లు వచ్చాయి. అటువంటి స్నేహితురాలు దొరకడం స్టీవార్ట్ అదృష్టమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లాన్స్ ఓ నటుడికి ఎంత మాత్రమూ తగ్గడని ప్రశంసలు కూడా వస్తున్నాయి. మరికొందరైతే ఆస్కార్ నటనను చూపించాడని కూడా కితాబిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి. 

Lover
Prank Video
Viral Videos
  • Loading...

More Telugu News