Dilip Kumar: మ్యూజియంలుగా దిలీప్ కుమార్, రాజ్ కపూర్ నివాసాలు... పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం

 Buildings of Dilip Kumar and Rajkumar in Pakistan will turn into museums

  • దేశవిభజనకు పూర్వం పాక్ లో జన్మించిన నట దిగ్గజాలు
  • ఇప్పటికీ నిలిచి ఉన్న వారి పూర్వీకుల భవనాలు
  • భవనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేసిన స్థానిక ప్రభుత్వం

బాలీవుడ్ నట దిగ్గజాలు దిలీప్ కుమార్, రాజ్ కపూర్ లకు చెందిన నివాసాలను మ్యూజియంలుగా మార్చనున్నారు. చిత్రసీమలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన దిలీప్ కుమార్, రాజ్ కపూర్ దేశవిభజనకు పూర్వం పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు. వారి కుటుంబ సభ్యులకు చెందిన భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే, వాటిని మ్యూజియంలుగా మార్చాలని స్థానిక ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవనాలను కొనుగోలు చేసేందుకు రూ.2.35 కోట్లు మంజూరు చేసింది.

దీనిపై ఖైబర్ పఖ్తుంక్వా ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు కమ్రాన్ బంగాష్ మాట్లాడుతూ, పెషావర్ లోని దిలీప్ కుమార్ నివాసం, రాజ్ కపూర్ కు చెందిన భవంతిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేశారని, వాటిని మ్యూజియంలుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. దేశవిభజనకు పూర్వం ఉన్న సంస్కృతిని పునరుజ్జీవింప చేయడం, పెద్దసంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా తమ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Dilip Kumar
Raj Kapoor
Houses
Museum
Pakistan
  • Loading...

More Telugu News