Zomato: సంవత్సరాది మహిమ... ఒక్క నిమిషంలో ఎన్ని ఫుడ్ ఆర్డర్లు వచ్చాయో చూడండి!

Zomata has taken record breaking orders on new year eve

  • నూతన సంవత్సర వేడుకలపై అనేక నగరాల్లో ఆంక్షలు
  • ఇళ్లకే పరిమితమైన ప్రజలు
  • ఫుడ్ కోసం జొమాటోకు ఆర్డర్లు
  • నిమిషానికి 4,100 ఆర్డర్లు అందుకున్న జొమాటో

కరోనా ఏడాదిగా చెడ్డపేరు తెచ్చుకున్న 2020 ముగిసింది. కొత్త ఆశలతో 2021 వచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని ఆంక్షలుండడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరుపుకునేవారి సంఖ్య తగ్గిందేమో కానీ, ఇళ్లలోనే 2021కి స్వాగతం పలికిన వారి సంఖ్య ఈసారి చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెల్లువలా వచ్చిపడిన ఆర్డర్లతో ఉక్కిరిబిక్కిరైంది.

పండుగలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జొమాటోకు నిమిషానికి 2,500 ఆర్డర్లు వస్తుంటాయట. కానీ నిన్న రాత్రి ఒక్క నిమిషంలో 4,100 ఫుడ్ ఆర్డర్లు వచ్చాయని జోమాటో సీఈఓ దీపీందర్ గోయల్ వెల్లడించారు. ఈ ఫుడ్ ఆర్డర్లలో అగ్రస్థానం బిర్యానీలు, పిజ్జాలదేనట. అనేక నగరాల్లో నూతన సంవత్సరాది వేడుకలపై ఆంక్షలు ఉండడంతో అత్యధికులు ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడ్డారు. దాంతో జొమాటో సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

Zomato
Food Orders
New Year
2021
  • Loading...

More Telugu News