Ramdas Athawale: కొత్తరకం కరోనా నేపథ్యంలో సరికొత్త నినాదం రూపొందించిన కేంద్రమంత్రి అథవాలే

Union minister Ramdas Athawale makes new slogan to tackle corona new strain

  • గతంలో 'గో కరోనా గో' అంటూ నినాదం
  • తాజాగా దేశంలో కరోనా నూతన స్ట్రెయిన్ కలకలం
  • 'నో కరోనా నో' అంటూ కొత్త నినాదం రూపొందించిన అథవాలే
  • గత అక్టోబరులో కరోనా బారినపడిన కేంద్రమంత్రి

కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరో నినాదానికి రూపకల్పన చేశారు. గతంలో కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఆయన 'గో కరోనా, కరోనా గో' అంటూ నినాదాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు కరోనా కొత్త స్ట్రెయిన్ రావడంతో తన నినాదానికి స్వల్ప మార్పులు చేశారు. 'నో కరోనా కరోనా నో' అంటూ కొత్త నినాదం తెరపైకి తెచ్చారు.

గతంలో తాను చేసిన 'గో కరోనా గో' అనే నినాదం విజయవంతంమైందని, నిజంగానే కరోనా వెళ్లిపోతోందని, ఇప్పడు కొత్తరకం కరోనా వైరస్ కూడా తన 'నో కరోనా నో' నినాదంతో వెళ్లిపోతుందని కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే వివరించారు. కరోనా గురించి ఇంత శ్రద్ధగా మాట్లాడే ఈ కేంద్రమంత్రికి గత అక్టోబరులో కరోనా సోకింది. గట్టి చికిత్స అనంతరం కోలుకుని మళ్లీ ఆరోగ్యవంతులయ్యారు.

Ramdas Athawale
Slogan
Corona Virus
New Virus
India
  • Loading...

More Telugu News