MS Dhoni: ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లకు సారథిగా ధోనీని ఎంపిక చేసిన ఐసీసీ

  • ఈ దశాబ్దపు అత్యుత్తమ జట్లను ప్రకటించిన ఐసీసీ
  • రెండు జట్లకు ధోనీని సారథిగా ఎంచుకున్న ఐసీసీ
  • టెస్టు జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ
  • టెస్టు జట్టులో అశ్విన్ కు కూడా స్థానం
ICC announces Dhoni as captain for team of the decades

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్ జట్లను ప్రకటించింది. ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20, వన్డే జట్లకు సారథిగా మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకోగా, విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా స్థానం దక్కించుకున్నారు. వీరే కాకుండా, సఫారీ విధ్వంసక క్రికెటర్ ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), లసిత్ మలింగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్) జట్టులోని ఇతర సభ్యులు.

ఇక ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు సారథిగా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. ఈ జట్టులో భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ కు కూడా స్థానం దక్కింది.

ఇవే కాకుండా మహిళల విభాగాల్లోనూ ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. అందులో మిథాలీరాజ్ (టెస్టు), ఝులాన్ గోస్వామి (టెస్టు), హర్మన్ ప్రీత్ (టీ20), పూనమ్ యాదవ్ (టీ20) లకు స్థానం లభించింది.

  • Loading...

More Telugu News