V Srinivas Goud: ఆర్మీజవాను అంత్యక్రియలకు హాజరైన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Telangana minister Srinivas Goud attends army soldier funerals

  • మహబూబ్ నగర్ జిల్లా వాసి పరశురాం లడఖ్ లో మృతి
  • ఆర్మీలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్న పరశురాం
  • కొండచరియలు విరిగిపడి దుర్మరణం
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వనికుంట తండాకు చెందిన పరశురాం అనే ఆర్మీ జవాను సరిహద్దుల్లో మరణించిన సంగతి తెలిసిందే. అతడి మృతి సమాచారాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే, జవాను పరశురాం మృతికి గల కారణాలు తాజాగా వెల్లడయ్యాయి. లడఖ్ వద్ద కొండచరియలు విరిగి పడిన ఘటనలో పరశురాం మృతి చెందినట్టు తెలిసింది.

నేడు, పరశురాం అంత్యక్రియలు అతడి స్వస్థలంలో నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరయ్యారు. జవాను కుటుంబ సభ్యులను ఓదార్చారు. జవాను పరశురాం కుమారుడ్ని ఎత్తుకుని వారికి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పరశురాం కుమార్తె తండ్రి భౌతికకాయం ఎదుట సెల్యూట్ చేయడం ఆ చిన్నారి స్ఫూర్తికి అద్దం పట్టింది.

V Srinivas Goud
Parasuram
Funerals
Army Jawan
Ladakh
  • Loading...

More Telugu News