Sathi Suryanarayana Reddy: బిక్కవోలు చేరిన అనపర్తి రాజకీయం... 10 నిమిషాల తేడాతో సత్యప్రమాణం చేసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

YCP and TDP Leaders visits Bikkavolu Ganapathi Temple

  • అనపర్తిలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఆరోపణలు
  • మైనింగ్ లో అవినీతికి పాల్పడ్డారన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే
  • సత్యప్రమాణం చేయాలని సవాళ్లు, ప్రతిసవాళ్లు
  • 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేసిన పోలీసులు

ఈ మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్యప్రమాణం చేశారు. మైనింగ్ అంశంలో ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్న ఈ అనపర్తి నేతలు గణపతి ఆలయంలో సత్యప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి తన అర్ధాంగితో కలిసి ఆలయానికి వచ్చి సత్యప్రమాణం చేసి వెళ్లగా, 10 నిమిషాల అనంతరం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సతీసమేతంగా వచ్చి సత్యప్రమాణం చేశారు. ఇరువురు నేతలు వచ్చి సత్యప్రమాణం చేసి వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నేతల రాక సందర్భంగా పోలీసులు బిక్కవోలులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ తో పాటు 30 పోలీసు చట్టాన్ని అమలు చేశారు.

Sathi Suryanarayana Reddy
Nallamilli Ramakrishna Reddy
Anaparthy
Bikkavolu
Telugudesam
YSRCP
East Godavari District
Andhra Pradesh
  • Loading...

More Telugu News