Heritage Foods: అప్పులు తీర్చేందుకు ఫ్యూచర్ రిటైల్ లో వాటాను వదులుకున్న హెరిటేజ్ ఫుడ్స్!

  • 2016లో ఫ్యూచర్ రిటైల్ కు హెరిటేజ్ విక్రయం
  • అప్పట్లో 3.65 శాతం వాటాలు పొందిన హెరిటేజ్
  • ఓపెన్ మార్కెట్లో తాజాగా విక్రయం
Heritage Sales Share in Future Retail

తమకున్న రుణాలను తీర్చడానికి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో తమ వ్యాపారాన్ని ఫ్యూచర్ రిటైల్ కు విక్రయించడం ద్వారా వచ్చిన సంస్థ వాటాలను రూ. 132 కోట్లకు విక్రయించింది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. దాదాపు 3 శాతానికి సమానమైన ఈక్విటీ వాటాలను ఓపెన్ మార్కెట్లో విక్రయించామని తెలియజేసింది. ఈ డబ్బుతో దీర్ఘకాల రుణాలను తీరుస్తామని స్పష్టం చేసింది.

కాగా, హెరిటేజ్ ఫుడ్స్, ఫ్యూచర్ రిటైల్ మధ్య కుదిరిన డీల్ తరువాత నాటి విలువ ప్రకారం, రూ. 295 కోట్ల విలువైన 3.65 శాతం షేర్లు ఫ్యూచర్ రిటైల్ నుంచి హెరిటేజ్ కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వాటాలనే సంస్థ విక్రయించింది.

More Telugu News