KCR: ఎన్టీ రామారావుతో కేసీఆర్... అరుదైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్!

In a rare photo KCR with legendary NTR
  • తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే నేతగా కేసీఆర్ ప్రస్థానం
  • టీడీపీలో కేసీఆర్ మూలాలు
  • కాంగ్రెస్ నుంచి టీడీపీలో ప్రవేశం
  • ఎన్టీఆర్ పై అభిమానంతో పార్టీలో చేరిక
తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి సీఎం కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలంగా తయారుచేసి, రాష్ట్రం ఏర్పాటులో కీలకంగా ఉన్న వ్యక్తి కేసీఆర్. అన్నింటికి మించి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే. అనూహ్య పరిస్థితుల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఆపై తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకోవడం నిస్సందేహంగా ఓ చరిత్రే. అయితే, అంతటి గొప్ప కేసీఆర్ మూలాలు టీడీపీలోనే ఉన్నాయి.

తొలినాళ్లలో విద్యార్థి విభాగం నేతగా కాంగ్రెస్ లో ఉన్న కేసీఆర్ తనకెంతో ఇష్టుడైన ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ ను వీడి టీడీపీకి వచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడా కేసీఆర్ ను ఎంతో అభిమానించేవారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో కేసీఆర్ కలిసున్నప్పటి ఓ అరుదైన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎన్టీఆర్ కాషాయ దుస్తుల్లో ఉండగా, యువకుడిగా ఉన్న కేసీఆర్ తన అభిమాన నేతపై ఆరాధ్యభావంతో చూస్తున్న దృశ్యం ఆ ఫొటోలో ఆవిష్కృతమైంది.

.
KCR
NTR
Rare Photo
Telugudesam
Telangana
TRS

More Telugu News