Mehbooba Mufti: మెహబూబా ముఫ్తీకి షాక్.. పార్టీకి ముగ్గురు గుడ్‌బై!

Setback for Mehbooba Mufti as three more senior PDP leaders resign from party
  • పార్టీ నైతిక విలువలకు తిలోదకాలిచ్చిందని ఆరోపణ
  • ప్రాథమిక సూత్రాలను పక్కన పెట్టిందని ఆరోపణ
  • జాతీయ పతాకంపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేతలైన ధమన్ బాసిన్, ఫల్లైల్ సింగ్, ప్రీతమ్ కొత్వాల్‌లు నిన్న పార్టీకి  గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ నైతిక విలువలు, నిజాయతీ కోల్పోయిందని ఆరోపించారు. అందుకనే పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని తమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ప్రాథమిక సూత్రాలను పార్టీ ఇటీవల పక్కన పెట్టిందన్నారు. జాతీయ పతాకంపై ఇటీవల ముఫ్తీ చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని ప్రీతమ్ కొత్వాల్ అన్నారు. పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఎంపీ టీఎస్ బజ్వా కూడా ముఫ్తీపై మండిపడ్డారు. మెహబూబా వ్యాఖ్యలు దేశభక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mehbooba Mufti
Jammu And Kashmir
resign

More Telugu News