Bhupesh Baghel: రాష్ట్ర ప్రజల కోసం కొరడా దెబ్బలు తిన్న చత్తీస్ గఢ్ సీఎం

Chatttisgarh CM has received whip shots for people well being
  • దుర్గ్ జిల్లాలో గోవర్థన్ పూజ
  • ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్న సీఎం భూపేశ్ బాఘేల్
  • చేతిపై కొరడాతో కొట్టించుకున్న వైనం
కొరడాతో కొట్టించుకోవడం అనేది మంచికైనా, చెడుకైనా బాధాకరమైన అంశమే. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ కూడా కొరడాతో కొట్టించుకున్నారు. ఓ సీఎం ఏంటి.. కొరడాతో కొట్టించుకోవడం ఏంటి అనే సందేహం రావొచ్చు. అయితే సీఎం బాఘేల్ కొరడా దెబ్బలు తినడం వెనుక బలమైన కారణమే ఉంది. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఆయన తన వయసును కూడా పట్టించుకోకుండా కొరడాతో కొట్టించుకున్నారు.

చత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లా జజంగీర్ గ్రామంలో గోవర్ధన్ పూజ (గౌరా గౌరి పూజ) జరిగింది. ఈ పూజలో పాల్గొని కొరడాతో కొట్టించుకుంటే కోరినది జరుగుతుందని ఓ నమ్మిక. దాంతో కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా దీవించాలంటూ చేతిపై కొరడాతో కొట్టించుకున్నారు. చత్తీస్ గఢ్ లో ప్రతి ఏటా దీపావళి అనంతరం ఈ గోవర్ధన్ పూజ నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. ఏదేమైనా ప్రజల కోసం దెబ్బలు తిన్న సీఎం భూపేశ్ బాఘేల్ నిజంగా అభినందనీయుడు.
Bhupesh Baghel
Whip
People
Corona Virus
Chattisgarh

More Telugu News