Venkatesh: వెంకటేశ్ సినిమా కూడా మొదలైంది!

Venkateshs narappa started its shoot
  • 'అసురన్'కి రీమేక్ గా వెంకటేశ్ 'నారప్ప'
  • గతంలో జరిగిన అరవై రోజుల షూటింగ్
  • హైదరాబాదులో తాజా షెడ్యూలు షూటింగ్ 
  • ప్రస్తుతం సన్నివేశాలు, క్లైమాక్స్ చిత్రీకరణ    

 లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ లో షూటింగుల సందడి మొదలైంది. లాక్ డౌన్ కి ముందు మొదలై, కొంత షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన సినిమాలు టాలీవుడ్ లో ఎన్నో వున్నాయి. వీటిలో స్టార్ హీరోల భారీ చిత్రాలు కూడా పలు వున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల మేరకు షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ఆయా నిర్మాతలు షూటింగులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు షూటింగుల్లో జాయిన్ అయ్యారు.

ఈ క్రమంలో సీనియర్ నటుడు వెంకటేశ్ నటిస్తున్న 'నారప్ప' చిత్రం తాజా షెడ్యూలు కూడా నిన్న హైదరాబాదులో మొదలైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగు అరవై రోజుల పాటు లాక్ డౌన్ కి ముందు జరిగింది.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు చెబుతూ, 'గతంలో అనంతపురం జిల్లా పాల్తూరు గ్రామంలో ఈ చిత్రం షూటింగును ప్రారంభించాం. ఆ తర్వాత తమిళనాడులోని కురుమలై, తెరికాడు రెడ్ డెజర్ట్ వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరించాం. ఇప్పుడు కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం' అని చెప్పారు.

ప్రస్తుతం ప్రియమణి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులపై షూటింగ్ చేస్తున్నారు. హీరో వెంకటేశ్ కూడా త్వరలో జాయిన్ అవుతారు. తమిళంలో వచ్చిన 'అసురన్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. డి.సురేశ్ బాబు, కలైపులి థాను కలసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

  • Loading...

More Telugu News