Vijayashanti: బుజ్జగింపులు.. విజయశాంతి ఇంటికి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి

  • విజయశాంతి కాంగ్రెస్ ను వీడుతున్నారనే ప్రచారం
  • ఆమెతో చర్చించిన మాణిక్యం ఠాగూర్
  • తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసిన విజయశాంతి
Manickam Tagore went to Vijayashanti home

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పార్టీని వీడుతున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఆమెను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఈరోజు విజయశాంతి నివాసానికి వెళ్లారు. ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆమెతో చాలా సేపు చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలను మాణిక్యంకు విజయశాంతి వివరించారు. తన తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ కూడా అనుమతి ఇచ్చారని... అయినా రాష్ట్ర నేతలు అడ్డుకున్నారని తెలిపారు.

More Telugu News