Sanjay Raut: ఆ కుర్రాడు సీఎం అయిపోయినా ఆశ్చర్యం లేదు: సంజయ్ రౌత్

No surprise if Tejashwi Yadav becomes CM says Sanjay Raut
  • కుటుంబ సభ్యులు జైళ్లలో ఉన్నా తేజశ్వి కదం తొక్కుతున్నాడు
  • బీహార్ లో అందరికీ సవాల్ విసురుతున్నాడు
  • బీజేపీకి ఈసీ ఒక విభాగం వంటిది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్డేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తేజశ్వి కుటుంబ సభ్యులు కేసుల్లో ఇరుక్కుపోయినా, జైళ్లలో ఉన్నా తేజశ్వి మాత్రం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రచారపర్వంలో కదం తొక్కుతున్నాడని, ధైర్యంగా పోరాడుతున్నాడని ప్రశంసించారు. తన కుటుంబసభ్యులపై ఐటీ, సీబీఐ కేసులు పెట్టినా... బీహార్ లో ప్రతి ఒక్కరికీ సవాల్ విసురుతున్నాడని అన్నారు.

ఎన్నికల తర్వాత ఆ కుర్రాడు బీహార్ ముఖ్యమంత్రి అయిపోయినా ఆశ్చర్యం లేదని సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. బీహార్ లో అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని ఈసీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారత ఎన్నికల సంఘం బీజేపీకి ఒక విభాగం వంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసీ నుంచి ఆశించడానికి ఏమీ లేదని అన్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News