Ajay: ఆత్మహత్యకు ముందు అజయ్ తల్లితో శ్వేత మాట్లాడిన ఆడియో లీక్!

Software Employ Swetha Latest Audio Clip Goes Viral

  • కనిపించకుండా పోయిన మరుసటి రోజునే విగతజీవిగా కనిపించిన శ్వేత
  • అంతకు ముందుగానే అజయ్ తల్లితో మాట్లాడిన శ్వేత
  • తన కుమారుడి తప్పు లేదంటున్న అజయ్ తల్లి

సాఫ్ట్ ‌వేర్ ఉద్యోగిని శ్వేత, ఆత్మహత్య చేసుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకునే ముందు, తన ప్రియుడు అజయ్ తల్లికి ఫోన్ చేసి, తన మనసులోని బాధను ఏడుస్తూ చెప్పుకుంది. బోరున విలపిస్తూ, తన వ్యక్తిగత చిత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని, అవి అజయ్ సెల్ ఫోన్లో మాత్రమే ఉన్నాయని బావురుమంది.

తానో ఆడ పిల్లనని, ఆ ఫొటోలు అజయ్ దగ్గర తప్ప మరెవరి వద్దా లేవని శ్వేత వేడుకుంటుంటే, తన కుమారుడు అటువంటి వాడు కాదని, ఆ చిత్రాలు మరెవరి నుంచో బయటకు వచ్చుంటాయని అజయ్ తల్లి చెబుతున్నట్టుగా ఉన్న ఓ ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తన బిడ్డ చాలా మంచివాడని, అలాంటి ఫొటోలను బయటకు తెచ్చి పరువు తీసే రకం కాదని అజయ్ తల్లి చెబుతుంటే, ఆ ఫొటోలు అజయ్ సెల్ ఫోన్లో తప్ప ఇంకెక్కడా లేవని శ్వేత వాపోయింది.

కాగా, గత నెల 18న ఇంటి నుంచి మాయమైన శ్వేత, ఆ తరువాతి రోజే రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. తాజా ఆడియో బహిర్గతం కావడంతో కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లు అయింది. తన వ్యక్తిగత చిత్రాలు అజయ్ సెల్ ఫోన్లో ఉన్నాయని శ్వేత చెబుతుండగా, దానితో తనకు సంబంధం లేదని, ఇటీవలే తాము పొట్టకూటి కోసం వచ్చామని అజయ్ తల్లి సర్ది చెబుతోంది. ఏదైనా ఉంటే తను వచ్చినప్పుడు చెప్పాలని కోరింది.

ఇదిలావుండగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న అజయ్ ని పోలీసులు ప్రశ్నించగా, శ్వేతతో కలిసి ఉన్న వ్యక్తిగత చిత్రాలను తానే స్వయంగా సోషల్ మీడియాలో అప్‌ లోడ్ చేసినట్టు అంగీకరించినట్టు సమాచారం. తాను చిత్రాలను పెట్టిన తరువాత తనపై కేసు పెట్టారని, అందుకే ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించానని అజయ్ వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అజయ్ తల్లితో శ్వేత మాట్లాడుతున్న ఆడియోను ఇక్కడ మీరూ వినవచ్చు.

Ajay
Swetha
Sucide
Leak
Audio
  • Loading...

More Telugu News