Kerala: రొమాంటిక్ ఫొటో షూట్ చేసిన కేరళ కొత్త జంట... నెట్టింట తిట్ల మీద తిట్లు!

Heavy Trooling on Kerala Couple Intimate Wedding Photo Shoot

  • గత నెల 16న వివాహం
  • ఇడుక్కి తేయాకు తోటల్లో ఫొటో షూట్
  • పర్సనల్ గా ఉంచుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్

తమ వివాహమైన తరువాత, ఫొటో షూట్ లో పాల్గొన్న కేరళ కొత్త జంట, ఓవర్ డోస్ రొమాంటిక్ చిత్రాలను దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు, తిట్ల వర్షం ఎదురైంది. రిషీ కార్తికేయన్, లక్ష్మి అనే యువతీ యువకులకు గత నెల 16న వివాహం జరిగింది. కరోనా నిబంధనల కారణంగా, వారు ముందుగా అనుకున్నంత వైభవంగా పెళ్లి వేడుకలను ప్లాన్ చేసుకోలేదు. అయితే, తమ వివాహాన్ని మరింత గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావించి, ఎవరూ చేయని సాహసానికి దిగారు. ఓ ఫొటోగ్రాఫర్ ను తీసుకుని ఇడుక్కి తేయాకు తోటల్లోకి వెళ్లారు.

అంతవరకూ బాగానే ఉంది. కానీ, ఫొటో షూట్ లో వారి ప్రవర్తనే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. అసభ్యకరంగా వారు ఫొటోలు దిగారు. వాటిని పర్సనల్ గా ఉంచుకున్నా సరిపోయేది. కానీ 'వెడ్డింగ్ ఫొటో షూట్' అంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి.

తమపై వస్తున్న విమర్శలపై స్పందించిన రిషీ, "పెళ్లి తరువాతి ఫొటోలు చాలావరకు సాదాసీదాగా ఉంటాయి. వరుడు, వధువు సంప్రదాయ దుస్తులు ధరించి, చేతులు పట్టుకుని, దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఫొటోలు దిగుతారు. మేము మాత్రం విభిన్నంగా ఉండాలని భావించాం" అని చెప్పుకొచ్చాడు. ఫొటో షూట్ లో తామేమీ పూర్తి నగ్నంగా లేమని, అయినా ఔట్ డోర్ లో, అందునా పబ్లిక్ ప్లేస్ లో అలా ఎలా ఫొటోలు దిగుతామని ప్రశ్నించారు. కొంత వెరైటీగా గుర్తుండిపోవాలనే ఇటువంటి చిత్రాలు దిగామని తెలిపాడు.

Kerala
New Couple
Intimate
Photo Shoot
Trool
  • Loading...

More Telugu News