China: లడఖ్ ను గుర్తించేది లేదన్న చైనా.. వార్నింగ్ ఇచ్చిన ఇండియా

Inida gives counter to China on Ladakh
  • మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదన్న ఇండియా
  • పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక
  • లేకపోతే చైనా అంశంలో తాము కూడా జోక్యం చేసుకుంటామని వ్యాఖ్య

వాస్తవాధీన రేఖ వద్ద పెద్ద సంఖ్యలో సైనికులను మోహరింపజేస్తూ చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈనెల 13న చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ లను భారతదేశ అంతర్గత భాగాలుగా తాము గుర్తించబోమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడఖ్ ను భారత్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కూడా చట్టవిరుద్ధమేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది.

తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత చైనాకు లేదని... పద్ధతి మార్చుకోకపోతే చైనా అంతర్గత వ్యవహారాల్లో తాము కూడా జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది. భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఇండియా వైఖరి ఎప్పుడూ నిలకడగా, స్పష్టంగా ఉందని అన్నారు. జమ్మూకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడూ భారత్ లో అంతర్గత భాగాలేనని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ కూడా భారత్ లో అంతర్భాగమని చెప్పారు.

  • Loading...

More Telugu News