Hansika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Hansika opposite Satyadev in a Telugu flick
  • మరో తెలుగు సినిమాలో హన్సిక 
  • బాలకృష్ణ సినిమాలో నవీన్ చంద్ర
  • 'ఇస్మార్ట్ శంకర్' హిందీ వెర్షన్లో రణ్ వీర్
*  ఆమధ్య సందీప్ కిషన్ హీరోగా వచ్చిన 'తెనాలి రామకృష్ణ' చిత్రంలో కథానాయికగా నటించిన హన్సిక తాజాగా మరో తెలుగు చిత్రంలో నటించనుంది. సత్యదేవ్ హీరోగా నటించే చిత్రంలో హన్సికను కథానాయికగా తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
*  బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా భారీ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక రౌడీ ఎమ్మెల్యే పాత్రలో తను కనిపిస్తాడట.
*  రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో దీనిని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ వెర్షన్లో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది.  
Hansika
Balakrishna
Naveen Chandra
Ram

More Telugu News